ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా కారులో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో కారులో వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉంది. పార్ నది ఒడ్డున చాలా సేపు ఆ కారు అలానే ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారుని తనిఖీ చేశారు. లాక్ అయిన కారు డోర్ ఓపెన్ చేసి చూడగా వెనుక సీట్లో వైశాలి మృతదేహం పడి ఉంది. సింగర్ వైశాలి బల్సారాగా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే వైశాలి భర్త హితేష్ తన భార్య శనివారం అర్ధరాత్రి 2 గంటల నుండి కనిపించడం లేదని పోలీసుకలు ఫిర్యాదు చేశాడు. కాగా ఆమె ఇవాళ కారులో అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఈ మృతి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వైశాలి భర్త హితేష్ కూడా సింగరే కావడంతో ఇద్దరూ కలిసి స్టేజ్ షోలు ఇచ్చేవారు. ఉన్నట్టుండి ఆమె మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మరి సింగర్ వైశాలి బన్సాలా అనుమానాస్పద మృతిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.