దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా.. కుల, మతాల పేరిట కోట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. నగరాలతో పోలిస్తే, గ్రామాల్లో కుల రక్కసి కోరలు చాచుతూనే ఉంది. కులాల పేరుతో కొన్ని కొన్ని ఊర్లు, నగరాలు కుంపటిని రగుల్చుకుంటున్నాయి. అగ్ర కులాల ఆధిపత్య పోరులో అణగారిన వర్గాలు అందులో ఆహుతి అవుతున్నాయి. బావిలో నీరు తాగకూడదని, తమ ఇళ్లల్లోకి రాకూడదని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలతో స్నేహం, ప్రేమించడం చేయకూడదన్న ఆంక్షలు వేస్తుంటారు. వారిని కాదని […]