ప్రజాప్రతినిధులు, మంత్రులు అప్పుడప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా కర్ణాటక మంత్రి ఒకరు.. రాష్ట్రాలు విడిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కర్ణాటక రెండుగా విడిపోబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయని తెలిపారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు తనకు తెలిసిందని అన్నారు. కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి […]