నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది.