భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. గతంలో 121 సర్వీసులు తిరిగేవి. అయితే ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా […]