తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకరి మరణవార్తను జీర్ణించుకునేలోపే మరో విషాదం చోటుచేసుకొని సినీ ప్రేక్షకులను కలచివేస్తుంది. ఇండస్ట్రీలో ట్రేడ్ గైడ్ మ్యాగజైన్ ప్రస్థానం అందరికీ తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాల కాలంపాటు ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని నిరంతరం అందించింది. ఈ మ్యాగజైన్ అధినేత, సీనియర్ ఫిలిం క్రిటిక్ గంజి లక్ష్మీనారాయణ శనివారం(మార్చి 19న) ఉదయం తుదిశ్వాస విడిచారు. లక్ష్మీనారాయణ మరణవార్త తెలియగానే ఫిలింక్రిటిక్ అసోసియేషన్ సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. […]