ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డుల విషయంలో భారీ పోటీ కనిపిస్తోంది. ఇండియాలో ప్రాపర్ పాన్ ఇండియా మూవీస్ కి బాటలు వేసింది బాహుబలి 2నే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. ఒక్కసారిగా బాక్సాఫీస్ ని షేక్ చేసి.. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా పెను తుఫాను సృష్టించింది. 6 ఏళ్ళ తర్వాత సరైన సాలిడ్ హిట్స్ లేక తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో పఠాన్ సినిమాతో మెరుపులు మెరిపించాడు షారుఖ్ ఖాన్..