ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డుల విషయంలో భారీ పోటీ కనిపిస్తోంది. ఇండియాలో ప్రాపర్ పాన్ ఇండియా మూవీస్ కి బాటలు వేసింది బాహుబలి 2నే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. ఒక్కసారిగా బాక్సాఫీస్ ని షేక్ చేసి.. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా పెను తుఫాను సృష్టించింది. 6 ఏళ్ళ తర్వాత సరైన సాలిడ్ హిట్స్ లేక తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో పఠాన్ సినిమాతో మెరుపులు మెరిపించాడు షారుఖ్ ఖాన్..
సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే కల్చర్ వచ్చాక.. బాక్సాఫీస్ కలెక్షన్స్, రికార్డుల విషయంలో భారీ పోటీ కనిపిస్తోంది. ఈ మధ్య అన్ని భాషల సినిమాలు పాన్ ఇండియా అంటూ బరిలో దిగుతున్నాయి. రీజియన్ హీరోలు సైతం బ్లాక్ బస్టర్స్ అందుకొని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అయితే.. ఇండియాలో ప్రాపర్ పాన్ ఇండియా మూవీస్ కి బాటలు వేసింది బాహుబలి 2నే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సిరీస్.. ఒక్కసారిగా బాక్సాఫీస్ ని షేక్ చేసి.. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసేసింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా పెను తుఫాను సృష్టించింది. వెరసి.. రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా.. కేవలం హిందీ వెర్షనే రూ. 511 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది.
2017లో బాహుబలి 2 సెట్ చేసిన ఈ రికార్డుని ఇప్పటిదాకా ఏ స్టార్స్ సినిమాలు చేరువ కాలేకపోయాయి. కానీ.. 6 ఏళ్ళ తర్వాత సరైన సాలిడ్ హిట్స్ లేక తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో కింగ్ షారుఖ్ ఖాన్.. ‘పఠాన్‘ సినిమాతో మెరుపులు మెరిపించాడు. పదేళ్లుగా ప్లాప్స్ లో ఉన్న షారుఖ్.. నాలుగేళ్ళపాటు బిగ్ స్క్రీన్ పై దర్శనమివ్వలేదు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో.. మాసివ్ కంబ్యాక్ హిట్ అందుకున్నాడు. ఏకంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూల్ చేసి.. బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ ని బీట్ చేసింది. కట్ చేస్తే.. హిందీ వెర్షన్ లో వరల్డ్ వైడ్ సంచలనాలు సృష్టించిన ఇండియన్ సినిమాలలో టాప్ 1 గ్రాసర్ గా పఠాన్ నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన టాప్ 10 సినిమాలు చర్చల్లోకి వచ్చాయి.
వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమాలు నెట్ కలెక్షన్స్ పరంగా సృష్టించిన రికార్డులు.. వాటి స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే.. ఇవి మరింత గొప్పగా ఆడే సినిమాలు వస్తే.. ఖచ్చితంగా స్థానాలలో మార్పులు జరుగుతాయి. ఇక ప్రస్తుతానికి మాత్రం.. పఠాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కి ఊపిరి అందించాడు. గతేడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 మూవీస్ తర్వాత.. ఇటీవల పఠాన్ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించి ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ కాగా.. జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో విడుదలైన పఠాన్.. 37 రోజుల్లో బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ ని అందుకోగలిగింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మించారు. మరి పఠాన్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ANOTHER HISTORY CREATED #Pathaan beats #Baahubali2 Hindi lifetime biz of ₹ 510.99 cr nett ( India).
Pathaan is now the BIGGEST NETT GROSSER IN HINDI LANGUAGE EVER IN INDIA.. #ShahRukhKhan does the UNTHINKABLE @yrf Brought the GLORY OF HINDI CINEMA ON TOP AGAIN. pic.twitter.com/PdVOyqD89c
— Sumit Kadel (@SumitkadeI) March 3, 2023