మహారాష్ట్ర లోని పూణె నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. పూణే నగరంలోని ఎరవాడ పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మాల్ ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శకలాల మద్య కూలీలు […]