Thyroid Symptoms in Telugu: ప్రసుత్త కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న ఆరోగ్య సమస్య థైరాయిడ్. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంది. చాలా మంది థైరాయిడ్ అనగానే భయపడతారు. కానీ కొన్ని టెస్ట్‌లు, మార్పుల ద్వారా థైరాయిడ్ సమస్యను కట్టడి చేయవచ్చు అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
ఈ మధ్య చాలామందిలో అత్యంత సాధారణంగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. ఇటీవలి కాలంలో చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? దానికి గల కారాణాలు ఏంటి? దీన్ని నయం చేసుకునే విధానాలు ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.. థైరాయిడ్ అనేది మన మెడ భాగంలో ఉండే ఒక గ్రంధి. ఈ గ్రంధి మూడు రకాల థైరాయిడ్ హార్మోన్స్ ను తయారు చేస్తుంది. అవి టీ3, టీ4, టీఎస్ హెచ్. టీ3 […]