ఆంధ్రప్రదేశ్ నూతన క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా రోజాకు ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు వింత అనుభవం ఎదురైంది. తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మధ్యాహ్నం పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న తర్వాత మంత్రి రోజాకు పలువురు అధికారులు, వైసీపీ నేతలు సన్మానించేందుకు పోటీ పడ్డారు. […]