ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం పనులు వేగం పుంజుకున్నాయి. అధికారులు ఇప్పటికే భూములను గుర్తించి మ్యాప్ కూడా సిద్ధం చేశారు. కలెక్టర్, ఆర్డీవో వారంరోజులు కృషి చేసి మొత్తం వెయ్యి ఎకరాలను గుర్తించారు. అడ్డంకి మండలంలోని తిమ్మాయపాలెం, అద్దంకి ప్రాంతాల్లో గుర్తించిన భూముల వివరాలు, మ్యాప్ ను శనివారం ఉన్నతాధికారులకు అందజేశారు. అధికారులు సిద్ధం చేసిన ప్రాథమిక నివేదిక వివరాల ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెంలోనే విమానాశ్రయం రానుంది. విమానాశ్రయం ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమి కావాల్సి ఉంది. […]