తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ జెండా ఎగురవేసింది.
తెలుగు నిర్మాతల మండలిలో ఫిబ్రవరి 19న ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు అధ్యక్షులు, సినీ నిర్మాత సి. కళ్యాణ్. నిర్మాతల మండలి ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూనే.. ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ విషయంపై సి. కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉంది. అదెప్పుడూ బాగుండాలని కోరుకుంటాము. టీఎఫ్పీసీ కమిటీపై కావాలనే కొందరు సోషల్ మీడియాలో బురద చల్లుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నాము. […]
తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే నెల 19న తెలుగు నిర్మాతల మండలికి ఎన్నికలు జరగుతున్ననేపథ్యంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉందని, అదెప్పుడూ బాగుండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. టీఎఫ్పీసీ కమిటీపై కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్పప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇద్దరు నిర్మాతలను వేటు వేసినట్లు చెప్పారు. […]