ఎలాన్ మస్క్.. ఈ పేరు గురించి ప్రపంచ దేశాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అతను సాధించిన విజయాలు చూస్తే.. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి వాహన పరిశ్రమలోనే కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాడు. అంతటి స్మార్ట్ మైండ్ దృష్టి తాజాగా స్మార్ట్ ఫోన్ లపై పడింది. ఈ భూమి మీదే కాకుండా అటు అంతరిక్షం నుంచి.. వేరే గ్రహాల(మార్స్) నుండి సైతం ‘హలో’ అంటూ మాట్లాడుకునే స్మార్ట్ ఫోన్లను […]
టెస్లా స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి రాబోతోంది. అదేంటి కారు బదులు ఫోన్ అని రాశాం అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. త్వరలో టెస్లా నుంచి సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నట్లు సమాచారం. కార్లు, స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రాజెక్టులే కాదు ఇప్పుడు టెస్లా ఖాతాలో ఫోన్లు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సాదాసీదా ఫోన్లు అయితే కాదు. మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ అని […]