టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా నమీబియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వల్ల టీమిండియాకు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, టీమిండియా హెచ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఆఖరి మ్యాచ్ కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్లబాడ్జీలు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఒక కారణం ఉంది. లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు […]
లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం 71వ ఏట మరణించారు. ఢిల్లీకి చెందిన తారక్ సిన్హాకు 2018లో ద్రోణాచార్య అవార్డు లభించింది. సిన్హా న్యూఢిల్లీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదవ భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా. ఢిల్లీకి చెందిన ఫేమస్ సోనెట్ క్లబ్‌లో ఆయన్ను […]