టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా నమీబియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వల్ల టీమిండియాకు ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి, టీమిండియా హెచ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఆఖరి మ్యాచ్ కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్లబాడ్జీలు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఒక కారణం ఉంది. లెజెండరీ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత తారక్ సిన్హా ఈ నెల 6 కన్నుముశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ టీమిండియా ఆటగాళ్లు ఇలా నల్లబ్యాడ్జీలు ధరించారు.
ఢిల్లీకి చెందిన తారక్ సిన్హాకు 2018లో ద్రోణాచార్య అవార్డు లభించింది. దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరణ్ సింగ్, రమాకాంత్ అచ్రేకర్, సునీతా శర్మ తర్వాత ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదవ భారత క్రికెట్ కోచ్ తారక్ సిన్హా. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు భారత్ తరపున ఆడిన ఎంతో మంది క్రికెటర్లను తారక్ తీర్చిదిద్దారు. రిషబ్ పంత్, ఆశిష్ నెహ్రా, సంజీవ్ శర్మ, ఆకాష్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, సురేందర్ ఖన్నా, రణధీర్ సింగ్, రామన్ లాంబా, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, అతుల్ వాసన్ లు తారక్ సిన్హా వద్ద కోచింగ్ పొందారు.
#TeamIndia is wearing black armbands today to pay their tributes to Dronacharya Awardee and widely respected coach Shri Tarak Sinha, who sadly passed away on Saturday.#T20WorldCup #INDvNAM pic.twitter.com/U2LHEtsuN9
— BCCI (@BCCI) November 8, 2021
My heartfelt condolences to the family, friends and trainees of Tarak Sinha Sir. Never met him but heard so many inspirational stories from Nehra and @cricketaakash His contribution to Indian Cricket will be forever remembered. May his soul Rest In Peace. Om Shanti 🕉️ https://t.co/NIxI8111H9
— VVS Laxman (@VVSLaxman281) November 6, 2021