తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కె.స్టాలిన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే చెన్నైలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.
చెన్నై (నేషనల్ డెస్క్)- దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు వారి పనులు చేసుకుని జీవనం సాగింతే వారు కష్టాల్లో మునిగిపోయారు. వీటన్నింటిని గమనించిన ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదల సంక్షేమానికి సంబందించిన ఫైలుపైనే ఆయన తొలి సంతకం చేశాకు. రేషన్ కార్డుదారులకు కరోనా నివారణ నిధి కింద 4 వేలు అందిస్తామని స్టాలిన్ ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు […]