తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కె.స్టాలిన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే చెన్నైలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.
దేశ వ్యాప్తంగా మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళలు సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చింది. ఇప్పటికే చెన్నై నగరంలో తిగిగే సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కె.స్టాలిన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చిన ఆయన తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం రేషన్ కార్డు కలిగిన అర్హులైన గృహిణులకు ‘మగళిర్ ఉరిమై తొగై ( ఉమెన్ రైట్ స్కీమ్)’ పథకాన్ని ప్రకటించారు సీఎం స్టాలిన్. ఈ పథకం ద్వారా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉండే మహిళకు ప్రతినెల రూ.1000 చొప్పున ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా మగలిర్ ఉరిమై ‘మగళిర్ ఉరిమై తొగై’ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఎన్నికల ప్రచారం సందర్బంగా తాను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటీ పూర్తి చేస్తానని పలు సందర్భాల్లో ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం స్టాలిన్ ఇప్పటికే చెన్నైలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ సీఎం అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబర్ 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టుగా తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ బుధవారం బడ్జెట్ లో ప్రకటించారు. దేశంలో నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి.. ముఖ్యంగా పెరిగిన గ్యాస్ ధరలు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. ఈ పథకంతో వారికి కొంతమేరకు ఊరట లభిస్తుందనే ఉద్దేశ్యంతో సీఎం స్టాలిన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు త్యాగరాజన్ తెలిపారు.
‘మగళిర్ ఉరిమై తొగై ’పథకానికి గాను తాజా బడ్జెట్ లో రూ.7 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో స్వగృహాలను నిర్మించుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న అడ్వాన్స్ రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతేకాదు దేశం కోసం యుద్దంలో ప్రాణాలు అర్పించిన అమరులైన తమిళ సైనికులకు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ గ్రేషియాను రూ.20 నుంచి రూ.40 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే సేవా పతకాలు పొందిన తమిళ సైనికులకు ఇచ్చే గ్రాంటును 4 రెట్లు పెంచబోతున్నట్లుగా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు.