చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో ఈ సారి ఎన్నికలు జరిగాయి. సుమారు పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే.. ఈసారి ఎట్టకేలకు విజయతీరాలను తాకింది. అటు అధికార అన్నాడీఎంకే గట్టిపోటీయే ఇచ్చినా, డీఎంకే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగానూ డీఎంకే కూటమి 157 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కొళ్లత్తూరు నుంచి పోటీచేసిన డీఎంకే […]
చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు . కోయంబత్తూర్ నియోజకవర్గంలో తన ప్రత్యర్ధి అభ్యర్ధిపై 1728 ఓట్ల తేడాతో కమల్ ఓడిపోయారు. ఓట్ల మెజారిటీ చాలా తక్కువగా ఉండటంతో అక్కడ రీకౌంటింగ్ చేయాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు. దీంతో అధికారికంగా ఫలితం వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది. తమిళనాడు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తాడనుకున్న కమల్ హాసన్ పార్టీ […]