సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించడానికి చాలా మంది ఉత్సుకత చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఒకవేళ సినిమాల్లో నటించే అవకాశం లభించినా ప్రేక్షకులను మెప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నటించాలనే ఆశ ఉంటే సరిపోదు దానికి తగిన కృషి చేయాలి అప్పుడే అభిమాన నటీనటులుగా రాణించబడతారు.