సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. సినిమాల్లో నటించడానికి చాలా మంది ఉత్సుకత చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాల కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఒకవేళ సినిమాల్లో నటించే అవకాశం లభించినా ప్రేక్షకులను మెప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నటించాలనే ఆశ ఉంటే సరిపోదు దానికి తగిన కృషి చేయాలి అప్పుడే అభిమాన నటీనటులుగా రాణించబడతారు.
ఇప్పుడంతా థ్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. బాల్యంలోని మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనంద పడిపోతున్నారు ప్రముఖ సెలబ్రిటీలు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన నటీనటులు ఈ వరుసలో ముందుంటున్నారు. సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్స్ వారి చిన్నప్పటి జ్ఞాపకాలను సోషల్ మీడియాద్వారా పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసి తన అభిమానులను ఆశ్యర్యపరిచింది. ఆ ఫోటోలో క్యూట్ గా డ్యాన్స్ చేస్తూ అలరించింది. ఇది చూసిన నెటిజన్స్ క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? ఆ ఫోటో వెనుకు ఉన్న కథేంటో చూద్దాం.
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి కనుమరుగైన తారలెందరో ఉన్నారు. తమ అందం అభినయం ద్వారా మెప్పించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే, వారు నటించిన సినిమాలు సక్సెస్ అయితే మరో సినిమాలో అవకాశం లభిస్తుంటుంది. లేదంటే అవకాశాలు తగ్గిపోయి సినీ ఇండస్ట్రీలో కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ హీరోయిన్ మాత్రం టాలీవుడ్ లో తన సిమాలు హిట్ లు , ఫ్లాప్ లు అనే తేడా లేకుండా గత 16 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అందం అభినయంతోనే కాకుండా అద్భుతమైన డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఆమె ఎవరో కాదు.. ఆ స్టార్ హీరోయినే తమన్నా.
తమన్నా టాలీవుడ్ లో ఎన్ టిఆర్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ సరసన నటించి మెప్పించింది. తన నటన గ్లామర్ తోనే కాకుండా డ్యాన్స్ తో అదరగొట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డ్యాన్స్ ఇరగదీసే హీరోయిన్లలో తమన్నా ఒకరు. అయితే తనకు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. బాల్యంలో తను డ్యాన్స్ చేస్తున్న ఓ ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ పోస్టులో తమన్నా స్టేజ్ పై డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ ఫోటోతో పాటు తను సాగర తీరాన డ్యాన్స్ చేస్తున్న వీడియోను కలిపి పోస్టు చేసింది. దానికి సంబంధించి ఆమె ఇలా రాసుకొచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని, డ్యాన్స్ చేయడం తప్పా తనకు మరొకటి సంతోషం కలిగించలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ, వెబ్ సిరీస్ లతో కూడా దూసుకుపోతుంది ఈ మిల్కీ బ్యూటీ తమన్నా.