రాష్ట్రంలో కరోనా వైరస్ వాహకులుగా భావిస్తున్న సూపర్ స్ర్పెడర్లకు ఈ నెల 28 నుంచి టీకాలివ్వాలని సర్కారు నిర్ణయించింది. తొలుత హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్లతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే వ్యవఽధి 84 రోజులకు పెంచారు. దీంతో ఉన్న కొవిషీల్డ్ డోసులన్నింటినీ సూపర్ స్ర్పెడర్లకే వేయాలని సర్కారు భావిస్తోంది. ఈలోగా కేంద్రం పంపే డోసులతో పాటు సొంతంగా సేకరించేవి సరిపోతాయని అంచనా వేస్తోంది. మార్కెట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సిన్ చేయాలని […]