చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణవార్తలను జీర్ణించుకోలేకపోతున్న సినీ అభిమానులను మరో ప్రముఖ నటుడి మరణవార్త విషాదంలో ముంచెత్తింది. 70, 80ల దశకాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన నటుడు సునీల్ షిండే సోమవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలోనే సునీల్ షిండే మరణించినట్లు ఆయన సన్నిహితుడు, సినీ విమర్శకుడు పవన్ ఝా మీడియాకు తెలిపారు. సునీల్ షిండే సోమవారం రాత్రి 1 గంట ప్రాంతంలో కన్నుమూశారని.. […]