టోక్యో పారాలింపిక్స్ 2020లో సోమవారం భారత్ అథ్లెట్‌లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో భారత అథ్లెట్ సుమిత్ అటిల్ ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సుమిత్ అత్యద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. సుమిత్ తొలి ప్రయత్నంలో జావెలిన్‌ను 66.95 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 68.08 మీటర్లు విసిరి తన పేరు […]