నందమూరి తారకరత్న అనారోగ్యం బారిన పడి దాదాపు నాలుగు రోజులు అవుతోంది. విషమ పరిస్థితుల నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన్ని కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువచ్చారు. ఇక అప్పటినుంచి బెంగళూరులోనే ఆయనకు చికిత్స అందుతోంది. వైద్యులు అత్యంత జాగ్రత్తగా తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యంలో మార్పులు చేస్తూ ఉన్నారు. కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉంటున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్ ఇస్తూ ఉన్నారు. […]