నందమూరి తారకరత్న అనారోగ్యం బారిన పడి దాదాపు నాలుగు రోజులు అవుతోంది. విషమ పరిస్థితుల నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన్ని కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువచ్చారు. ఇక అప్పటినుంచి బెంగళూరులోనే ఆయనకు చికిత్స అందుతోంది. వైద్యులు అత్యంత జాగ్రత్తగా తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యంలో మార్పులు చేస్తూ ఉన్నారు. కుటుంబసభ్యులు ఆసుపత్రి వద్దే ఉంటున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఓ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనే కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కే. గత మూడు రోజుల నుంచి ఆయన తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దే ఎక్కువగా ఉంటున్నారు.
తారకరత్న ఆరోగ్యం విషయంలో నారాయణ హృదయాలయ వైద్యులను పర్యవేక్షిస్తున్నారు. శనివారం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు తారకరత్నను చూడటానికి బెంగళూరు వచ్చారు. ఆ సమయంలో కూడా సుధాకర్ దగ్గరుండి వారిని రిసీవ్ చేసుకున్నారు. ఆసుపత్రి దగ్గరకు తీసుకెళ్లారు. వారు అక్కడ ఉన్నంత వరకు వారితో పాటు కలిసి తిరిగారు. ఇప్పుడు కూడా తారకరత్న విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్నారు. సుధాకర్‌కు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం అలాంటిది. అందుకే తారకరత్న ఆరోగ్యం కోసం ఓ ఇంటి సభ్యుడిలా అంతలా కష్టపడుతున్నారు. ఇక, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తారకరత్న ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ మేరకు అభిమానులు పలు పోస్టులు పెడుతున్నారు. వేనోళ్లా ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, తారకరత్న శుక్రవారం నారా లోకేష్ చేపట్టిన యువగళం కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్‌కు మద్దతుగా యాత్రలో నడుస్తూ ఉండగా కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి బాగోలేకపోవడంతో బెంగళూరుకు తీసుకువచ్చారు. మరి, తారకరత్న ఆరోగ్యం కోసం కృష్టి చేస్తున్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
తారకరత్న ప్రాణాలు కాపాడటానికి మనం ఎంత సేపు బాలయ్య, చంద్రబాబు గార్ల గురించే మాట్లాడుతున్నాం.
చాలా మందికి తెలియని వ్యక్తి కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి కేశవ సుధాకర్ గారు
చంద్రబాబు కర్ణాటక సీఎంతో మాట్లాడి బెంగళూరులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించాలని అడిగినప్పటి నుంచి మొదల. pic.twitter.com/xBQmUbI0xd— Sai Ram #Yuvagalampadayatra (@bobbysairam) January 29, 2023