ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ ఇకలేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. సుదర్శన్ ముదిరాజ్ మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆయన మరణం పట్ల ఉత్సవ కమిటీ సంతాపం ప్రకటించింది. ఈరోజు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. […]