జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు (చతురార్దమూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచా మందిరానికి చేరుకో నున్నారు. రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర […]