జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతం. జనసంద్రం నడుమ అత్యంత వైభవంగా జరగాల్సిన యాత్ర ఆద్యంతాలు ఈ ఏడాది కరోనా కారణంగా జనసంచారం లేని వీధుల గుండా సోమవారం జరగబోతోంది. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర రథాలు సుందరంగా ముస్తాబయ్యాయి. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు (చతురార్దమూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచా మందిరానికి చేరుకో నున్నారు. రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించ బడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి. ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది.
ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉంది. ఇంద్రద్యుమ్న తీర్థం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిదిట పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో 3, 5, 7, 9 రోజుల్లో ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి అంటారు
ఇంకా నేతితో ప్రతిరోజూ దీపమెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయిట.