ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుని పూజిస్తారు. ఇక వీధులలో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తులపై కూడా గణపతికి వల్లమాలిన అభిమానం. ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. వినాయకుడి వాహనం మూషికం అంటారు. కానీ ఎలుకతో పాటు సింహం, నెమలి, పాము కూడా ఆయనకు వాహనాలే. మత్సాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని […]