2003 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి విశ్వవిజేతగా అవతరించిన ఆస్ట్రేలియా.. కరేబియన్ గడ్డపై 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టింది. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా.. ఆ వరల్డ్ కప్‌లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో శ్రీలంకతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాంటింగ్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాథ్యూ హేడెన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆడమ్ గిల్‌క్రిస్ట్.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పటికీ ప్రపంచ […]