SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Why Adam Gilchrist Kept Squash Ball In His Left Hand Glue Full Details Of Squash Ball Mystery

2007 WC ఫైనల్లో గిల్‌క్రిస్ట్‌ విధ్వంసం! కానీ.. గ్లౌజ్‌లో స్క్వాష్‌ బాల్‌ ఎందుకు?

    Updated On - Fri - 2 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
2007 WC ఫైనల్లో గిల్‌క్రిస్ట్‌ విధ్వంసం! కానీ.. గ్లౌజ్‌లో స్క్వాష్‌ బాల్‌ ఎందుకు?

2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియాను ఓడించి విశ్వవిజేతగా అవతరించిన ఆస్ట్రేలియా.. కరేబియన్‌ గడ్డపై 2007లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా అడుగుపెట్టింది. రికీ పాంటింగ్‌ కెప్టెన్సీలో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా.. ఆ వరల్డ్‌ కప్‌లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో శ్రీలంకతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ పాంటింగ్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మ్యాథ్యూ హేడెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇప్పటికీ ప్రపంచ అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్లలో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి ఆటగాడు.. ఫైనల్లో జూలువిదిల్చిన సింహంలా రెచ్చిపోయాడు.

చమిందా వాస్‌, లసిత్‌ మలింగా, ముత్తయ్య మురళీధరణ్‌ లాంటి హేమాహేమీ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 104 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సులతో ఏకంగా 149 పరుగులు భారీ స్కోర్‌ చేశాడు. గిల్‌క్రిస్ట్‌ విధ్వంసంతో 38 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 281 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించారు. ఆ తర్వాత లంకకు 36 ఓవర్లలో 269 పరుగుల టార్గెట్‌ను ఇచ్చారు. లంక 36 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా వరుసగా వన్డే వరల్డ్‌ కప్‌ను సాధించి.. మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌. తన అద్భుతం బ్యాటింగ్‌తో ఆసీస్‌కు భారీ స్కోర్‌ అందించాడు, సెంచరీతో కదంతొక్కాడు. అయితే.. సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌క్రిస్ట్‌.. తన ఎడమచేతి గ్లౌజ్‌ను చూపించాడు. అది మధ్యలో కాస్త ఉబ్బి ఉంది. అప్పట్లో అది సంచలనంగా మారింది.

10,000 పరుగుల చేసినా ఒక్కసారి కూడా సెలక్ట్ చేయలేదు!

దానిపై వివాదం కూడా చెలరేగింది. గిల్‌క్రిస్ట్‌ నిబంధనలు అతిక్రమించి.. గ్లౌజ్‌లో ఏదో పెట్టుకుని బ్యాటింగ్‌ చేశాడని, ఆస్ట్రేలియా చీటింగ్‌ చేసి వరల్డ్‌ కప్‌ గెలిచిందంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. అయితే.. గిల్‌క్రిస్ట్‌ తన ఎడమ చేతి గ్లౌజ్‌లో స్క్వాష్‌ బాల్‌ పెట్టుకుని బ్యాటింగ్‌ చేశాడనే విషయం కొన్ని రోజులకు బయటకొచ్చింది. అయితే.. అసలు గిల్‌క్రిస్ట్‌ ఆ బాల్‌ను ఎందుకు తన గ్లౌజ్‌లో పెట్టుకున్నాడు? అలా పెట్టుకోవడం వల్ల అతనికి ఏంటి ఉపయోగం? అనే విషయాలను స్వయంగా గిల్‌క్రిస్ట్‌ వివరించాడు. ఆ స్క్వాష్‌ బాల్‌ విశేషాలు, దాని వెనుకున్న మిస్టరీ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

2007 వరల్డ్‌ కప్‌ కంటే ముందు గిల్‌క్రిస్ట్‌ తన బ్యాటింగ్‌ టెక్నిక్‌ విషయంలో కాస్త ఇబ్బంది పడుతుంటేవాడు. ఆ సమయంలో అతని బ్యాటింగ్‌ కోచ్‌ స్క్వాష్‌ బాల్‌ను గిల్‌క్రిస్ట్‌కు పరిచయం చేశాడు. అతని ఎడమ చేతి గ్లౌజ్‌లో అరచేతిలో ఆ బాల్‌ను పట్టుకుని బ్యాటింగ్‌ చేస్తుంటే.. గిల్‌క్రిస్ట్‌ బ్యాటింగ్‌లో ఇంప్రూమెంట్‌ గమనించాడు. ఆ బాల్ పెట్టుకోక ముందు.. తన రెండుచేతుల పది వేళ్లు, బ్యాట్‌ హ్యాండిల్‌ను బలంగా పట్టుకునేవి.. దీంతో టాప్‌ హ్యాండ్‌(కుడిచేయి) పవర్‌.. షాట్‌పై తక్కువ పడుతుండేది. దీంతో బ్యాట్‌లో స్విగ్‌ కూడా సరిగా ఉండకపోయేది. ఈ లోపాన్ని గమనించిన గిల్‌క్రిస్ట్‌ బ్యాటింగ్‌ కోచ్‌.. స్క్వాష్‌ బాల్‌ను గిల్‌క్రిస్ట్‌ ఎడమ చేతి గ్లౌజ్‌లో పెట్టాడు.

10,000 పరుగుల చేసినా ఒక్కసారి కూడా సెలక్ట్ చేయలేదు!

దాంతో గిల్‌క్రిస్ట్‌ ఎడమ చేతి చిటికెన వేలు, ఉంగరపు వేలు బ్యాట్‌ హ్యాండిల్‌ను జెస్ట్‌ అలా తాకి ఉండేవే తప్ప.. గట్టిగా పట్టుకునే వీలు లేకుండా ఉండేది. అలా ఉండటంతో.. షాట్‌ ఆడేటప్పుడు టాప్‌ హ్యాండ్‌ పవర్‌ ఎక్కువగా జనరేట్‌ అయ్యేది. బ్యాట్‌ స్వింగ్‌ కూడా అద్భుతంగా ఉండేది. బ్యాట్‌ పట్టుకునేటప్పుడు ఎడమ చేతి బోటన వేలు, చూపుడు వేలు, కుడి చేతి అన్ని వేళ్లతో గ్రిప్‌ దొరికేది. ఎడమ చేయి చివరి రెండు, మూడు వేళ్ల ఒదులుగా ఉండటంతో.. గిల్‌క్రిస్ట్‌ బ్యాటింగ్‌ చాలా సులువుగా చేసేవాడు. బాల్‌పై మంచి టైమింగ్‌తో బ్యాట్‌ స్వింగ్‌ అయ్యేది. స్టోక్‌ మేకింగ్‌ అద్భుతంగా ఇంప్రూవ్‌ అయ్యింది. కాగా.. ఆ స్క్వాష్‌ బాల్‌ కాస్త మెత్తగా ఉండటంతో అతనికి మంచి గ్రిప్‌ దొరికేది.

ఈ టెక్నిక్‌తోనే గిల్‌క్రిస్ట్‌ 2007 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో 149 పరుగులతో చెలరేగి ఆడాడు. ఆ తర్వాత ఈ విషయంపై వివాదం చెలరేగినా.. అప్పటి శ్రీలంక జట్టు కెప్టెన్‌ మహేలా జయవర్దనే సైతం.. అతి తప్పు కాదని, టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవాడనికి, గ్రిప్‌ కోసం గిల్‌క్రిస్ట్‌ స్క్వాష్‌ బాల్‌ గ్లౌజ్‌లో పెట్టుకుని ఆడాడని పేర్కొన్నాడు. కాగా.. గిల్‌క్రిస్ట్‌ విషయంలో సక్సెస్‌ అయిన ఈ స్క్వాష్‌ బాల్ టెక్నిన్‌ను మరికొంత మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం ప్రయత్నించారు. కానీ.. వారి విషయంలో ఈ టెక్నిన్‌ బెడిసి కొట్టింది. మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్‌ జార్జ్‌ బెల్లీ సైతం గిల్లీ(గిల్‌క్రిస్ట్‌) వాడిన స్క్వాష్‌ బాల్‌ టెక్నిన్‌ను బాది బొక్కబోర్లా పడ్డాడు. ఒక టెస్టు మ్యాచ్‌ సందర్భంగా గ్లౌజ్‌లో స్క్వాష్‌ బాల్‌ పెట్టుకుని ఆడిన బెల్లీ.. పుల్‌ షాట్‌ ఆడటంలో ఫెయిలై.. వికెట్‌ సమర్పించుకున్నాడు. అదోక చెత్త టెక్నిక్‌ అని బెల్లీ పేర్కొన్నాడు. కానీ.. ఇప్పటికీ కూడా 2007లో ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు గిల్‌క్రిస్ట్‌ చీటింగ్‌ చేశాడని చాలా మంది క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతుంటారు.

వీడియో: గ్లౌజ్‌లో స్క్వాష్‌ బాల్‌ ఎందుకు పెట్టుకున్నాడో వివరిస్తున్న గిల్‌క్రిస్ట్‌

వీడియో: గిల్‌క్రిస్ట్‌ స్క్వాష్‌ బాల్‌ పెట్టుకోవడంపై స్పందించిన అప్పటి శ్రీలంక కెప్టెన్‌ జయవర్దనే

Tags :

  • 2007 ODI World Cup
  • Adam Gilchrist
  • AUS VS SL
  • Cricket News
  • Squash Ball
  • SumanTV Cricket Special
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?

పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?

  • IND vs AUS: అశ్విన్ ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా నయా ప్లాన్.. చిక్కులు తప్పవా?

    IND vs AUS: అశ్విన్ ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా నయా ప్లాన్.. చిక్కులు ...

  • వీడియో: డ్రెస్సింగ్ రూంలో యూసఫ్ పఠాన్ రచ్చ.. బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతూ..

    వీడియో: డ్రెస్సింగ్ రూంలో యూసఫ్ పఠాన్ రచ్చ.. బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతూ..

  • కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో ఈ ఒక్క ప్లేయర్‌తోనే ఆస్ట్రేలియాకు చిక్కులు!

    కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో ఈ ఒక్క ప్లేయర్‌తోనే ఆస్ట్రేలియాకు చిక్...

  • భారత్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ కామెంట్స్.. తొండాట ఆడే ఛాన్స్ ఉందంటూ!

    భారత్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ కామెంట్స్.. తొండాట ఆడే ఛాన్స్ ఉందంటూ!

Web Stories

మరిన్ని...

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?
vs-icon

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!
vs-icon

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

తాజా వార్తలు

  • మెగాస్టార్ చిరంజీవి కాస్ట్ లీ వాచెస్.. ఒక్కొక్కటి ఎంత రేటంటే?

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు..

  • మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

  • మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

  • మహేష్ సినిమా ఆడిషన్స్.. తెగ భయపడిపోయాను: హీరోయిన్ సమీరారెడ్డి

  • ఉచితంగా 5 లక్షల విమాన టికెట్లు.. పర్యాటకులకు బంపర్ ఆఫర్!

  • రూ.5 వేలలోపు 3 బర్నల్‌ బెస్ట్ గ్లాస్ టాప్‌ స్టౌవ్స్ ఇవే!

Most viewed

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • బాలికను గర్భవతి చేసిన బాలుడు! ఎక్కడంటే?

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. సొంత ఊర్లోనే విధులు..

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam