గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అధికార పక్షంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో తరహా జూదాలను నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా కేసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగాయని తెలుగు దేశం […]