గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఏ చిన్న కారణం దొరికినా అధికార పక్షంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో తరహా జూదాలను నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా కేసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. ఇలా అసాంఘిక కార్యకలాపాలు సాగాయని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్లో కేసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. కే కన్వెన్షన్ సెంటర్లో కేసినో జూదం, అసభ్యకర నృత్యాలు, పేకాట నిర్వహణ ద్వారా రూ. 500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఏపిలో గోవా రాష్ట్రాన్ని మించేలా గుడివాడలో తతంగం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ ఫంక్షన్ లో హల్ లో సాగిన క్యాసినో సెంటర్ విషయమై సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
ఇది చదవండి : గుడివాడ కేసినో వివాదం: కొడాలి నానిపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్!
సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ అంశంపై విచారణ చేసేందుకు ప్రత్యేక అధికారిగా నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులును కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ నియమించారు. ఈ సందర్భంగా విజయవాడ కృష్ణా జిల్లాలో సంక్రాంతిని పురస్కరించుకొని నిర్వహించిన క్యాసినో పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ సిద్దార్ద కౌశల్ ఆదేశించారు. ప్రత్యేక బృందంతో నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విచారణ ప్రారంభించనున్నారు. మరి..గుడివాడ గోవా అయ్యింది అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.