ఆంధ్రప్రదేశ్ తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇక రేషన్ కార్డుపై రాగులు, జొన్నలు తీసుకోవచ్చు. వాటిని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు అందించే విషయమై వాలంటీర్లతో సర్వే చేపట్టామని అన్నారు. రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరానని, తొలుత రాయల సీమ జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. దశల వారీగా రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన రాగులు, జొన్నలు […]