పాములను చూస్తే మనమంతా ఆమడ దూరం పరిగెడతాం. అదే విషసర్పాలైతే అంతే సంగతి. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతి పాములను అలవోకగా పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలా పట్టుకున్న పాములను సురక్షితంగా అడవిలోకి విడిచిపెడుతోంది. వందకు పైగా విషసర్పాలను బంధించి..సెంచరీ కూడా కొట్టేసింది. మంగళూరు, అశోక నగర్ ప్రాంతానికి చెందిన శరణ్య భట్.. ప్రస్తుతం బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. చుట్టుపక్కల ఎవరి ఇళ్లలో అయినా పాములు చొరబడ్డాయంటే.. వెంటనే తనకు పిలుపొస్తుంది. అక్కడకి వెళ్లిన […]