మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది. మేఘాలయలోని తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు అర్దరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ బస్సులో 21 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12 గంటల సంమయంలో నాంగ్‌చ్రామ్ వద్ద […]