కర్ణాటకలో కరోనా విలయతాండం చేస్తోంది. రోజురోజుకీ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం కరోనా రోగులతో బెడ్లన్నీ నిండిపోవడంతో ఆస్పత్రుల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులకూ కూడా కరోనా సోకితే బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి తన పరిస్థితి వివరిస్తూ కంటతడి పెట్టుకోవడం సంచలనంగా మారింది. ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు […]