హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ చిన్నారి కుటుంబాన్ని పలువురు నటులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చిన్నారికి న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు షర్మిల తల్లి విజయమ్మ కూడా […]