కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచేసింది. పునీత్ చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ఆయన కుటుంబం, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధిని ప్రతిరోజూ వందల సంఖ్యలో దర్శించుకుంటున్నారు. మంగళవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పునీత్ ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇదే గ్రౌండ్స్ లో పునీత్ ‘రాజకుమార’ […]