కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెల్లడించారు. దాంతో దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సోషలిస్టు నేతగా, జేడీయూకు అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు శరద్ యాదవ్. […]