ఎమ్మా మెక్‌కియాన్!.. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇప్పుడు ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా స్విమ్మర్ ఎమ్మా ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో స్విమ్మింగ్ విభాగంలో తనకు ఎదురులేదని ఎమ్మా నిరూపించింది. ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా ఎమ్మా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఎమ్మా మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. […]