ఎమ్మా మెక్‌కియాన్!.. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇప్పుడు ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా స్విమ్మర్ ఎమ్మా ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో స్విమ్మింగ్ విభాగంలో తనకు ఎదురులేదని ఎమ్మా నిరూపించింది. ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా ఎమ్మా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఎమ్మా మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణాలు కాగా మూడు క్యాంస్యాలు ఉన్నాయి.
మిక్స్‌డ్ మెడ్లీరిలే విభాగాల్లో క్యాంస్యం గెలిచింది. ఓవరాల్‌గా ఎమ్మా మెక్‌కియాన్ 2016 రియో ఒలింపిక్స్ కలుపుకొని ఇప్పటివరకు 11 పతకాలు సాధించి ఆస్ట్రేలియా తరుపున అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఒక ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు కొల్లగొట్టిన ఆటగాడిగా అమెరికాకు చెందిన మైకెల్ పెల్స్ తొలి స్థానంలో ఉన్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పెల్స్ 8 పతకాలతో మెరవగా అవన్నీ స్వర్ణ పతకాలే కావడం విశేషం.
1952లో సోవియట్ జిమ్మాస్ట్ మరియా గోరోకోవిస్కయ రికార్డును ఎమ్మా సమం చేసింది. అలాగే స్విమ్మింగ్ లెజెండ్ ఇయాన్ తోర్ప్ రికార్డును అధిగమించి ఆస్ట్రేలియా తరపున మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఒలింపిక్స్‌లో ఎమ్మా తర్వాతి స్థానంలో అమెరికన్ ఫ్రీ స్టైల్ స్మిమ్మర్ కాలెబ్ డ్రెసెల్ 5 పతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఎమ్మా మెక్‌కియాన్ తోపాటు కేలీ మెక్ కియోన్ చెల్సీ హాడ్జెస్ కేట్ క్యాంప్ బెల్ లతో కూడిన ఆస్ట్రేలియా టీమ్ రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ అమెరికాకు షాకిచ్చింది. ఈ విజయం తో టోక్యో ఒలింపిక్స్ లో మెక్ కియోన్ మొత్తం మెడల్స్ సంఖ్య ఏడుకి చేరింది.