టాలెంట్ హంటింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. 2022 ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా వేలంలో మెరికల్లాంటి ఆటగాళ్లను తీసుకుని జట్టును మునుపటి కంటే పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లపై దృష్టిపెట్టింది. దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ఆటగాళ్లపై ట్రయల్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే T20 కెరీర్‌లో 24 సిక్సర్లు కొట్టిన 24 ఏళ్ల […]