టాలెంట్ హంటింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. 2022 ఐపీఎల్ సీజన్ కోసం మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా వేలంలో మెరికల్లాంటి ఆటగాళ్లను తీసుకుని జట్టును మునుపటి కంటే పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లపై దృష్టిపెట్టింది. దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న ఆటగాళ్లపై ట్రయల్స్ ప్రారంభించింది.
ఈ క్రమంలోనే T20 కెరీర్‌లో 24 సిక్సర్లు కొట్టిన 24 ఏళ్ల బ్యాట్స్‌మన్‌ని సీఎస్‌కే ట్రయల్స్‌కి పిలిచింది. ఈ బ్యాట్స్‌మెన్ దేశవాళీ క్రికెట్‌లో ఒడిశా జట్టులో సభ్యుడు. అంతేకాదు కెప్టెన్ కూడా చేశాడు అతడి పేరు సుభ్రాంశు సేనాపతి. చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్‌ను ట్రయల్స్‌కి పిలిచినట్లు ఒడిశా క్రికెట్ స్వయంగా ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌లో ఒడిశా క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి బ్యాటింగ్ శైలిని కూడా పోస్ట్ చేసింది.
నిజానికి ఈ రెండు టోర్నీలలో ప్రదర్శన కారణంగా CSK సేనాపతిని ట్రయల్స్‌కి పిలిచింది. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో సుభ్రాంశు సేనాపతి తన జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 5 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 275 పరుగులు చేశాడు. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో T20 ఫార్మాట్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఈ ఏడాది 138 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
ఈ ఒడిశా క్రికెటర్ టీ20 కెరీర్‌ను పరిశీలిస్తే, అతను 26 మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు, 50 ఫోర్లతో 637 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌లోనూ సేనాపతి తన సూపర్ ఫామ్‌ను నిలుపుకుంటాడని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, కార్యదర్శి సంజయ్ బెహెరా ఆశాభావం వ్యక్తం చేశారు. CSK ఇప్పటికే జడేజా, ధోని, రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి CSK టాలెంట్ హంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Subhranshu Senapati Called for Selection Trials by the champions CSK in the IPL. Bringing you his batting highlights from the recently concluded Vijay Hazare Trophy & Syed Mushtaq Ali Trophy. @BCCI @ChennaiIPL @cricket_odisha @WasimJaffer14 pic.twitter.com/gBKlFDaDX4
— Odisha Cricket Association (@cricket_odisha) December 18, 2021