కరోనా వైరస్ సోకిందా? లేదా? తెలుసుకోవాలంటే టెస్ట్ చేసుకోవాలి. అయితే ఇక కోవిడ్ 19 టెస్ట్ చేసుకోవడానికి ఎక్కడికీ వెళ్లకుండానే తక్కువ ఖర్చుతో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోవచ్చు. కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టింగ్ కిట్ ను ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. పేరు కోవిసెల్ఫ్. […]