తక్కువ సమయంలోనే ఎక్కవ డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలని తప్పుడు బాటలో నడుస్తు పోలీసులకు చిక్కుతున్నారు. స్మగ్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. విలువైన వస్తువులను విదేశాల స్మగ్లింగ్ చేస్తు కోట్లు సంపాదిస్తున్నారు.
పన్ను ఎగవేస్తూ హైదరాబాద్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న లగ్జరీ కార్ల యజమానులపై దృష్టి సారించిన రవాణాశాఖ రవాణాశాఖ కొరడా విసిరింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. ఈ క్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో చర్యలకు ఉపక్రమించారు. 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు, మోటర్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేస్తున్న కార్ల యజమానులను గుర్తించేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. […]