నాగాలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. భద్రతా దళాలు మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు […]