తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జిల్లెలపేటలో ఎస్‌ఈబీ పోలీసులపై సారా వ్యాపారులు దాడికి దిగారు. ఈ దాడిలో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. జిల్లెలపేట వద్ద గోదావరిలో పడవపై సారా తరలిస్తున్నట్లు సమాచారమందుకుని.. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజోలు ఎస్ఈబి ఎస్ఐ రఘు, కానిస్టేబుళ్లు నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసుడు దాడులు జరిపారు. ఆ క్రమంలో సారా వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తులు.. రాజోలు ఎస్ఈబీ పోలీసులపై ప్రతి దాడులు జరిపారు. ఆ దాడిలో ఎస్ఈబీ కానిస్టేబుల్ వాసంశెట్టి […]