ఇటీవల కెమికల్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్ లలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ యజమానులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి నిధులను వ్యవసాయ శాఖ కమిషనరేట్ వ్యక్తిగత ఖాతాలకు(పీడీ) పంపిణీ చేయడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను తిరిగి జమ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్టడికి వినియోగించాల్సిన ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన రూ.1100 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించిందంటూ పల్లా […]
కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అమర్ నాథ్ యాత్రికులపై ప్రకృతి బీభత్సం సృష్టించిది. కొండలపై నుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాత్రను తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనలు 9 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గత కొన్నిరోజులుగా ఇక్కడ […]